
‘కరెంట్ తీగ’ సినిమాలో ఇటు స్కూల్ గర్ల్ పాత్రలో యూనిఫాంలోను, అటు టీనేజ్ అమ్మాయిగా లంగా వోణి, పట్టు పరికిణిలలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఢిల్లీ డాల్ రకుల్ ప్రీత్ సింగ్. ఇక పాటల్లో అయితే కావలసినంత గ్లామర్ ఒలకబోసింది. నటన పరంగా కూడా మంచి మార్కులే పడ్డాయి. ‘కరెంట్ తీగ’ విజయంతో రకుల్ ప్రీత్ సింగ్ హట్రిక్ హిట్ కొట్టింది.
రకుల్ ప్రీత్ తెలుగులో నటించిన తొలి రెండు సినిమాలు ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘లౌక్యం’ మంచి విజయాలు సాదించాయి. హట్రిక్ హిట్ కొట్టడంతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. పలువురు విశ్లేషకులు ఈ అమ్మడుని గోల్డెన్ లెగ్ గా అభివర్ణిస్తున్నారు. స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయని సమాచాం. చాలా తక్కువ సమయంలో తెలుగు నేర్చుకోవడం, యూనిట్ లో అందరితో తెలుగులో మాట్లాడడం రకుల్ కి బాగా ప్లస్ అయ్యింది.

