
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’. ఈ సినిమా నవంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతోంది. ఈ సినిమాతో అల్లరి నరేష్ ఓవర్సీస్ ని ఎక్కువగా టార్గెట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు’ సినిమా ఓవర్సీస్ లో పెద్ద హిట్ అయ్యింది. దానికి కారణం ఆ సినిమా కామెడీ బాగా వర్క్ అవుట్ అవ్వడం.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫైనల్ కాపీ చూసుకున్నాక అల్లరి నరేష్ కి సినిమా మీద మరింత నమ్మకం వచ్చింది. ‘సుడిగాడు’లోలానే ఇందులో కూడా బాగా కామెడీ వర్కౌట్ అయ్యింది కావున ఓవర్సీస్ లో పెద్ద హిట్ అవుతుందని ఈ చిత్ర టీం అనుకున్నారు. దాంతో ఓవర్సీస్ లో ఈ సినిమా భారీగా రిలీజ్ చెయ్యడానికి అల్లరి నరేష్ ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం అక్కడ ఎక్కువ స్క్రీన్స్ కోసం తయారు చేస్తున్నారు.
ఈ సినిమాలో అల్లరి నరేష్ కి చుక్కలు చూపించే సిస్టర్ పాత్రలో కార్తీక నటించింది. బి.చిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాని అమ్మిరాజు కానుమిల్లి నిర్మించాడు. సెన్సారు నుండి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్.

