పవన్ కళ్యాణ్ ని ఫాలో అయిన శృతి హాసన్

పవన్ కళ్యాణ్ ని ఫాలో అయిన శృతి హాసన్

Published on Nov 3, 2014 10:04 AM IST

Shruti-Haasan
ఇటీవలే పవన్ కళ్యాణ్ తన అభిమాని అయిన చిన్నారి పాప చివరి కోరికను తీర్చడం కోసం ఖమ్మం వెళ్లి ఆ పాను చూసి కొంత సమయం గడిపి వచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఈ సంఘటన తనని అభిమానించే అభిమానుల్లో అతనిపై అభిమానాన్ని మరింత పెంచడమే కాకుండా ఈ విష్యం ప్రతి ఒక్కరికీ తెలిసింది.

ఇప్పుడు సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ శృతి హాసన్ కూడా పవన్ కళ్యాణ్ ఫాలో అవ్వనుంది. శృతి హాసన్ డై హార్డ్ ఫ్యాన్ అయిన శీతల్ తన ఆరోగ్యం బాలేదని, తను ఎక్కువ రోజులు బతకను అని తెలుసుకున్నాక తన అభిమాన హీరోయిన్ అయిన శృతి హాసన్ ని కలవాలని కోరింది. ఈ విషయాన్నీ మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా శృతి హాసన్ కి తెలియజేశారు. దీనిని పాజిటివ్ గా తీసుకున్న శృతి ముంబైలో షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ తీసుకొని పూణే వెళ్లి శీతల్ ని కలిసి తనకి ఒక లెటర్ ఇవ్వడమే కాకుండా శీతల్ తో కొంత సమయాన్ని గడిపి వచ్చింది.

తాజా వార్తలు