‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోన వెంకట్

‘బ్రదర్ అఫ్ బొమ్మాళి’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోన వెంకట్

Published on Nov 3, 2014 10:28 AM IST

brother-of-bommali-kona-ven
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా నటించిన బ్రదర్ అఫ్ బొమ్మాళి సినిమా నవంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. కానీ ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్రకి కోన వెంకట్ అని పేరు పెట్టారు. పాత్ర బాగున్నప్పటికీ భవిష్యత్తులో కోన వెంకట్ కంప్లైంట్ చేస్తే సెన్సార్ సభ్యులకు ఇబ్బంది అవుతుందని కోన వెంకట్ కి సినిమా చూపించి నో అబ్జెక్షన్ లెటర్ తీసుకురమ్మని చెప్పారు.

ఈ చిత్ర డైరెక్టర్ బి. చిన్ని కోన వెంకట్ కి స్పెషల్ గా షోని చూపించారు. ఆయన సినిమా చూసాక కోన వెంకట్ బ్రహ్మానందం పాత్ర చాలా బాగుందని, అలాంటి పాత్రకి తన పేరు వాడుకోవడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా నో అబ్జెక్షన్ లెటర్ కూడా ఇచ్చారు. బ్రదర్ అఫ్ బొమ్మాళి టీం సెన్సార్ వారికి ఆ లెటర్ చూపించి ఫైనల్ సెన్సార్ కాపీని తీసుకున్నారు. దీంతో సినిమా నవంబర్ 7న రిలీజ్ కి రెడీ అవుతోంది.

అల్లరి నరేష్ కి చుక్కలు చూపించే సిస్టర్ గా కార్తీక కనిపించనుంది. మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హర్షవర్ధన్ రాణే ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. అమ్మిరాజు కానుమిల్లి నిర్మించిన ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు