మార్చ్ లో అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను మూవీ..?

మార్చ్ లో అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను మూవీ..?

Published on Nov 4, 2014 3:21 PM IST

boyapati_allu_arjun
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో ఓ సినిమా తెరకెక్కనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఫిల్మ్ నగర్ తాజా సమాచారం ప్రకారం బోయపాటి చెప్పిన కథ అల్లు అర్జున్ మరియు అల్లు అరవింద్ లకు బాగా నచ్చిందట.

ఇదొక యాక్షన్ & రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫిల్మ్. బోయపాటి గత సినిమాలకు కొంచం భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. ఈ ఏడాది చివరిలో అధికారిక ప్రకటన వెలువడుతుంది. 2015 మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు. అని అల్లు అర్జున్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. బహుశా ఈ రెండు సినిమా పూర్తయిన తర్వాత వీరి కలయికలో సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు