డబ్బింగ్ పనులలో బందిపోటు

డబ్బింగ్ పనులలో బందిపోటు

Published on Nov 5, 2014 12:42 AM IST

Mohan-Krishna-Indraganti
తన మొదటిసినిమాతోనే గౌరవప్రదమైన జాతీయ అవార్డుని సొంతం చేసుకున్న దర్శకులలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఒకరు. ఆ తరువాత ఆయన అష్టాచెమ్మా, అంతకుముందు ఆ తరువాత, గోల్కొండ హై స్కూల్ వంటి చిత్రాలు తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన ‘బందిపోటు’ అనే అవుట్ అండ్ అవుట్ కామెడి ఎంటర్టైనర్ తీయడంలో బిజీగా వున్నారు.

ఈ చిత్రానికి గతంలో సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన బందిపోటు చిత్రానికి ఎటువంటి సంబంధం లేదని కూడా తెలిపారు. జూలైలో షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం దాదాపు పుర్తికావచ్చింది. అల్లరి నరేష్, ఈషా ప్రధానతారాగణం. శ్రీనివాస్ అవసరాల, సంపుర్ణేష్ బాబు లు ముఖ్యపాత్రధారులు. కళ్యాణి కోడూరి సంగీత దర్శకుడు

తాజా వార్తలు