
‘భారి యాక్షన్ సినిమాలలో నటించే సమయంలో గాయాలు(ఇంజురీ) కావడం సహజం అని నేను అనుకుంటున్నాను, ఆన్ లొకేషన్ (సెట్స్)లో అయినా కావొచ్చు, బయట అయినా కావొచ్చు’ అని ఆరడుగుల అందగాడు రానా దగ్గుబాటి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అసలు ఏం జరిగింది అని ఆలోచిస్తున్నారా..?
మంగళవారం సాయంత్రం ‘బాహుబలి’ షూటింగ్ పూర్తయిన తర్వాత వానిటీ రూంకు వెళ్ళే సమయంలో రానా తల రూం డోర్ కు గట్టిగా తగిలింది. రానా బాగా హైట్ కావడం వలన ఈ సంఘటన జరిగింది. దాంతో స్వల్ప గాయమైంది. ‘కొన్నిసార్లు జైంట్ పర్సనాలిటీ వలన ఎటువంటి ఉపయోగం ఉండదు’ అంటూ తన హైట్ మీద ట్విట్టర్ లో జోక్ వేశాడు.
ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా నటినటులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్నారు. యం.యం.కీరవాణి స్వరాలను అందిస్తున్నారు.

