‘ఇంటర్ స్టెల్లార్’ ఐమాక్స్ టికెట్స్ కి ఫుల్ క్రేజ్

‘ఇంటర్ స్టెల్లార్’ ఐమాక్స్ టికెట్స్ కి ఫుల్ క్రేజ్

Published on Nov 6, 2014 12:52 AM IST

Interstellar-Imax-bookings
డార్క్ నైట్ సీరిస్ తర్వాత హాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన ‘ఇంటర్ స్టెల్లార్’ విడుదలకి సిద్దమవుతోంది. నవంబర్ 7న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇండియాలో మొదటగా నవంబర్ 5 నుంచి ప్రీమియర్ షోస్ చేసారు కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోకపోవడంతో 7న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. చాలా రోజుల నుంచి మూవీ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

కొద్ది సేపటి క్రితమే ప్రసాద్స్ ఐమాక్స్ లో ఐమాక్స్ స్క్రీన్ కి సంబందించిన టికెట్స్ బుకింగ్ ఓపెన్ చేసారు. ఈ సినిమాని అందరూ 70ఎంఎం ఐమాక్స్ లో చూడాలని ఎక్కువ ఆసక్తి చూపుతుండడంతో ఈ సినిమా టికెట్స్ కి సూపర్బ్ క్రేజ్ నెలకొంది. గతంలో నోలాన్ నుంచి వచ్చిన సూపర్బ్ మూవీస్ వల్ల అభిమానులకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా యుఎస్ కి చెందినా కొంతమంది విమర్శకులు ఈ సినిమాకి మంచి రేటింగ్స్ ఇవ్వడంతో ఇండియాలో ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరిగింది.

తాజా వార్తలు