
అరుణ్, ఆర్య, తనిష్క్ తివారి, ప్రజ్ఞ నటీనటులుగా ప్రసన్నాక్షి పిక్చర్స్ పతాకంపై అజయ్ హంసాగర్ నిర్మించిన సినిమా ‘ఎవరికి ఎవరు’. వెన్నెలకంటి కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చిన్నికృష్ణ సంగీతం అందించారు. సురేష్ గంగుల, శాంతకుమార్, దీప్తి సాయనోరా సాహిత్యం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం భుదవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఖమ్మం ఎంపి పొంగులేటి సుధకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
తొలి ఆడియో సిడిని పొంగులేటి సుధకర్ ఆవిష్కరించి సాయి కుమార్ కు అందజేశారు. అనంతరం పొంగులేటి సుధకర్ మాట్లాడుతూ సినిమా విజయవంతం కావాలని యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదిత్య ఆడియో ద్వారా ఈ సినిమా పాటలు మార్కెట్ లోకి విడుదలయ్యాయి.
సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ సినిమాకు జి.వెంకటేశ్వర ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. వివి కమల్ డైలాగులను రాశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్ సభ్యులు తమ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

