
సాయి ధరమ్ తేజ్, రెజినా జంటగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.
‘పిల్లా నువ్వులేని జీవితం’ తర్వాత మరోసారి సాయి ధరమ్ తేజ్, రెజినా జంటగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 27 నుండి ప్రారంభిస్తారు. కథ ప్రకారం 50 శాతం సినిమాను అమెరికాలో చిత్రీకరిస్తారు. ‘రామయ్యా వస్తావయ్యా’ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఆసక్తి కలిగించారు దర్శకుడు. గత కొన్ని రోజుల క్రితమే టైటిల్ మీడియాలో పబ్లిసిటీ పొందింది. ఈ రోజు ఈ చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటించారు.
సుమన్, కోట శ్రీనివాసరావు, నాగ బాబు, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ – లక్ష్మణ్, వెంకట్ స్టంట్స్ అందిస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్,రమేష్ రెడ్డి, సతీష్ వెగ్నెశ్న, తోట ప్రసాద్ స్క్రీన్ ప్లే సమకూరస్తున్నారు.

