
‘ప్రతినిధి’తో డీసెంట్ హిట్ అందుకున్న నారా రోహిత్ హీరోగా వస్తున్న తదుపరి సినిమా ‘రౌడీ ఫెలో’. నారా రోహిత్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమాలో విశాఖ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాని నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అది కాకుండా ఎం.ఆర్ సన్నీ అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఈ చిత్ర టీం ప్లాటినం డిస్క్ వేడుక చేయనున్నారు.
అది కూడా హైదరబాద్ లో కాకుండా విజయవాడలో ప్లాన్తినం డిస్క్ వేడుకని గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 15వ తీదీన విజయవాడ దగ్గరలోని హాయ్ ల్యాండ్ టూరిస్ట్ ప్లేస్ లో రౌడీ ఫెలో ప్లాటినం డిస్క్ వేడుకని గ్రాండ్ గా చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. లిరిసిస్ట్ గా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాని ప్రకాష్ రెడ్డి నిర్మించాడు. ఈ సినిమాలో సీనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ‘భలే తమ్ముడు’లోని ‘ఎంతవారుగాని.. వేదాంతులైనాగాని.. వాలు చూపు తాకగానే’ పాటను రీమిక్స్ చేసారు.

