
ఎప్పట్నుంచో వెండితెరకు పరిచయం కావాలన్న సాయి ధరమ్ తేజ్ కోరిక ఈ నెల 14న ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా రూపంలో తీరనుంది. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ ముగించుకుని ‘ఏ’ సర్టిఫికేట్ సంపాదించుకుంది. గతకొన్నిరోజుల క్రితం విడుదలైన ఆడియోకి మంచి స్పందన లభించడం ఆనందకరం. ఈ ఆడియో విజయోత్సవ వేడుకను విజయవాడ లయోలా కాలేజీలో జరపనున్నారు. సాయి ధరమ్ తేజ్, రెజినా తదితరులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
ఈ సినిమాలో జగపతిబాబు ముఖ్యపాత్ర పోషించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే ఈ చిత్రాన్ని బన్నీ వాస్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దిల్ రాజు మరియు అల్లు అరవింద్ సమర్పకులు.

