ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ‘రాకా'(Raaka) ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘పుష్ప 2’ తర్వాత బన్నీ మరోసారి తన గ్లామర్‌ను పక్కన పెట్టి, ‘యానిమల్’ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ లుక్ చూసిన అభిమానులు బన్నీ మేకోవర్‌కు ఫిదా అవుతుంటే, సాధారణ ప్రేక్షకులు మాత్రం ఇంతటి భయంకరమైన గెటప్‌ను ఊహించలేదని అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఈ సినిమా టైటిల్ ‘రాకా’ చుట్టూ ఇప్పుడు అనూహ్యమైన చర్చ మొదలైంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘శక్తి’ చిత్రంలో విలన్ పాత్ర పేరు కూడా రాకా కావడంతో, నెటిజన్లు ఆ పాత డిజాస్టర్‌ను గుర్తు చేస్తున్నారు. దీంతో ‘శక్తి’ దర్శకుడు మెహర్ రమేష్ పేరు అకస్మాత్తుగా ట్రెండింగ్‌లోకి వచ్చింది. పాత పరాజయాలను ప్రస్తుత ప్రాజెక్టుతో ముడిపెడుతూ నెటిజన్లు మీమ్స్ వేయడం వల్ల సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఈ నెగిటివ్ ట్రెండ్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. కేవలం టైటిల్ కలిసినంత మాత్రాన పాత ఫ్లాప్ సినిమాలను ప్రస్తావించడం కరెక్ట్ కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సేఫ్ జోన్‌లో ఉండకుండా, ప్రతి సినిమాకు కొత్తగా ప్రయత్నించే బన్నీ సాహసాన్ని మెచ్చుకోవాల్సింది పోయి, కావాలనే కొందరు నెగిటివిటీని వ్యాప్తి చేస్తున్నారని వారు వాదిస్తున్నారు. ఏదేమైనా, ఒక్క పోస్టర్‌తో సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లడంలో అల్లు అర్జున్ మరోసారి సక్సెస్ అయ్యాడని చెప్పాలి.


