
ప్రస్తుతం అజిత్ సరసన ‘ఎన్నై అరిందాల్’ అనే తమిళ సినిమాలో త్రిష నటిస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ చెన్నై సుందరి ఫ్లూతో భాదపడుతుంది, డాక్టర్స్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారట.
9 రోజులలో 50 టిష్యూ బాక్సులు ఖాళీ అయ్యాయి. ఈ ఫ్లూ ఇంకా ఎన్ని రోజులలో నన్ను వదలి వెళ్తుంది. చాలా అలసిపోయాను. హాచ్.. అంటూ త్రిష ట్వీట్ చేసింది.
తమిళ సినిమాతో పాటు తెలుగులో బాలయ్య 98వ సినిమాలో నటిస్తుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం దాటింది. అయినా తన హవా కొనసాగిస్తుంది. అవకాశాలు చేజిక్కించుకునే విషయంలో కొత్త హీరోయిన్లకు గట్టి పోటి ఇస్తుంది.

