
అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున వారసుడిగా ఈ తరం హీరోగా త్వరలో తెలుగు తెరకు పరిచయం కానున్న హీరో అక్కినేని అఖిల్. ‘మనం’ సినిమాలో 2 నిమిషాలు కనిపించి అందరినీ ఆకట్టుకున్న అఖిల్ సోలో హీరోగా నటించనున్న సినిమాకి వివి వినాయక్ డైరెక్టర్. నితిన్ ఫాదర్ అయిన సుధాకర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా నవంబర్ 15న అధికారికంగా ప్రారంభం కానుంది.
మాకు అందిన తాజా సమాచారం ప్రకారం అఖిల్ మొదటి సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశం ఎస్ఎస్ తమన్ కి దక్కింది. ఈ చిత్ర టీం అంతా కూడా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అనగానే సముఖత చూపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. మరోవైపు అఖిల్ సరసన నటించే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. అఖిల్ మొదటి సినిమాకి ‘ఢమరుకం’ ఫేం వెలిగొండ శ్రీనివాస్ కథని అందిస్తుంటే కోన వెంకట్ – గోపి మోహన్ కథా సహకారం – డైలాగ్స్ అందిస్తున్నారు.

