అభిమానులతో సందడి చేయనున్న సాయి ధరమ్ తేజ్ & రెజినా

అభిమానులతో సందడి చేయనున్న సాయి ధరమ్ తేజ్ & రెజినా

Published on Nov 15, 2014 9:21 AM IST

sai-dharam-tej-regina

సాయి ధరమ్ తేజ్, రెజినా జంటగా నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొదటి ఆట నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దర్శకుడు రవి కుమార్ చౌదరి సినిమాను చాలా వినోదాత్మకంగా తెరకెక్కించారు. సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మన్స్ కు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఈ సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకోవడం కోసం హీరో హీరోయిన్లు ఇద్దరూ ఈ రోజు హైదరాబాద్ కుకట్ పల్లి విశ్వనాథ్ థియేటర్ ను సందర్శించనున్నారు. అభిమానులతో కలసి సక్సెస్ సెలెబ్రేట్ చేసుకోవడానికి 2 గంటల షోకి ధియేటర్ కి వస్తున్నారు.

జగపతి బాబు ఈ సినిమాలో కీలకమైన మైసమ్మ పాత్రలో నటించారు. స్క్రీన్ ప్లే సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. అల్లు అరవింద్, దిల్ రాజుల సమర్పణలో బన్ని వాసు, హర్షిత్ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు