నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా సినిమా ‘పటాస్’. ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ‘పటాస్’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. డిసెంబర్ ద్వితీయార్ధంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాత ప్రయత్నిస్తున్నారు.
ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ & మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. నేడు విడుదలైన న్యూ స్టిల్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాయి.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఓ కొత్త హీరోయిన్ ను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నారు.


