త్వరలో తల్లి కాబోతున్న సమీర రెడ్డి

త్వరలో తల్లి కాబోతున్న సమీర రెడ్డి

Published on Nov 15, 2014 6:30 PM IST

sameera-reddy
హిందీ, తెలుగు, తమిళ భాషలలో సినిమాలు చేసిన సమీర రెడ్డి హీరోయిన్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గత ఏడాది వ్యాపారవేత్త ఆకాష్ ను సమీర రెడ్డి వివాహం చేసుకుంది. ముంబైలో వివాహ జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. తాజా వార్త ఏంటంటే.. త్వరలో సమీర రెడ్డి తల్లి కాబోతుంది. ప్రస్తుతం ఆమె గర్భవతి. త్వరలో డెలివరీ అవుతుందని సమాచారం.

సమీర రెడ్డి సన్నిహితులు ఈ వార్తను దృవీకరించారు. వారు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. చివరిసారిగా రానా దగ్గుబాటి నటించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమా ఐటెం సాంగ్ లో సమీర రెడ్డి కనిపించింది. ఆమె నటించిన ‘నామ్’ అనే హిందీ సినిమా విడుదలకు రెడీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు