
మెగా వారసుడు వరుణ్ తేజ్, పూజ హెడ్గే జంటగా నటిస్తున్న ‘ముకుంద’. ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. కేవలం కొన్ని పాటల చిత్రీకరణ మాత్రమే బాలన్స్ ఉన్నాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ ఫేం శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోను డిసెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ‘ముకుంద’ను నిర్మిస్తున్నారు.

