నితిన్ ‘చిన్నదాన నీ కోసం’ ఆడియో రిలీజ్ డేట్

నితిన్ ‘చిన్నదాన నీ కోసం’ ఆడియో రిలీజ్ డేట్

Published on Nov 16, 2014 1:20 PM IST

Chinnadana-Nee-Kosam

రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో వరుస హిట్ అందుకొని ఫుల్ జోరు మీదున్న యంగ్ హీరో నితిన్ ‘చిన్నదాన నీకోసం’ అంటూ మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ తో సిద్దమవుతున్నాడు. ‘చిన్నదాన నీ కోసం’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టాడు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీం ఈ సినిమా ఆడియోని నవంబర్ 27న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అలాగే ఈ సినిమాని డిసెంబర్ 19న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ స్పెషలిస్ట్ అయిన కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ మిస్తి హీరోయిన్ గా నటిస్తోంది.

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వరుసగా మూడు మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన తర్వాత నితిన్ – సూప్ రూబెన్స్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఆడియో కూడా వాటిని మించేలా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు