ప్రభాస్ విడుదల చేసిన ‘చక్కిలిగింత’ ఆడియో

ప్రభాస్ విడుదల చేసిన ‘చక్కిలిగింత’ ఆడియో

Published on Nov 16, 2014 6:12 PM IST

Chakkiligintha-Audio--(13)
‘అంతకముందు ఆ తరువాత’, ‘లవర్స్’ సినిమాలతో విజయం అందుకున్న సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన సినిమా ‘చక్కిలి గింత’. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ సుకుమార్ స్నేహితుడైన వేమారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవలే రిలీజ్ చేసారు. షూటింగ్ మొత్తం పూర్తవడంతో ఈ సినిమా ఆడియోని నిన్న హైదరబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసారు.

ఈ అదుఇఒ లాంచ్ కి ముఖ్య అతిధిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వచ్చాడు. దిల్ రాజు, సుకుమార్, మారుతి, బివిఎస్ఎన్ ప్రసాద్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసారు. నరసింహా రెడ్డి – నరసింహాచారి కలిసి మహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సుమంత్ అశ్విన్ సరసన రెహన హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీత మందిస్తున్న ఈ సినిమాలో చైతన్య కృష్ణ, తాగోబోతు రమేష్, సప్తగిరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు