
రజినీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేయాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుతున్నారు. తాజాగా ‘లింగ’ ఆడియో విడుదల కార్యక్రమంలో సినీ ప్రముఖులు కూడా ఇదే కోరికను వ్యక్తం చేశారు. అప్పుడు రజిని స్పందించక తప్పలేదు.
రాజకీయల గురించి పూర్తి అవగాహన ఉంది. అవి ఎంత ప్రమాదకరమైనవో కూడా తెలుసు. ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి. ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు సేవ చేయగలనా..? లేదా..? అని ఆలోచిస్తున్నాను. రాజకీయాల్లోకి రావడానికి భయపడడం లేదు, సందేహిస్తున్నాను అంతే. అని తనను ఎంతగానో అభిమానించే వేలాది ప్రేక్షకుల మరియు సినిమా ప్రముఖుల మదిలో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు సూపర్ స్టార్ రజినీకాంత్. ప్రజలకు మంచి చేయాలని నా మనసులో బలంగా ఉంది. ఏ దారిలో చేస్తాను అనేది ఆపైవాడి నిర్ణయంపై ఆధారపడి ఉంది అంటూ ముగింపు పలికారు.
ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో నా రాజకీయ రంగ ప్రవేశం గురించి అడుగుతున్నారు. ఇప్పుడు కూడా నేను సమాధానం ఇవ్వకపోతే నాకు పొగరనుకుంటారు. అంటూ పైవిధంగా స్పందించారు.

