
61వ నేషనల్ అవార్డ్స్ లో తెలుగు నుంచి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు స్పెషల్ మెన్షన్ అవార్డ్స్ అందుకున్న సినిమా ‘నా బంగారు తల్లి’. అంతే కాకుండా ఇండోనేషియన్, ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో కూడా అవార్డ్స్ గెలుచుకుంది. ఈ చిత్ర టీం ఈ సినిమాని నవంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ కోసం పబ్లిక్ మనీని ఇన్వెస్ట్ చేస్తోంది. ఎవరో తీసిన సినిమాని పబ్లిక్ రిలీజ్ చెయ్యడం ఏంటా అని ఆశ్చర్య పోతున్నారా.??
అసలు విషయంలోకి వెళితే ఈ చిత్ర నిర్మాత అయిన సునీత కృష్ణన్ దగ్గర రిలీజ్ చెయ్యడానికి మనీ లేకపోవడంతో ఈ సినిమా రిలీజ్ కోసం పబ్లిక్ ని హెల్ప్ చెయ్యమని రిక్వెస్ట్ చేసింది. దానికి చాలా మంది స్పందించి ఇన్వెస్ట్ మెంట్ చేసారు. ఆ మనీతో సునీత కృష్ణన్ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళతో టై అప్ అయ్యి సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇలా పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ తో సినిమా రిలీజ్ చేయడం ఇదే ప్రధమం అని చెప్పాలి. ఈ నెల 21న సుమారు 100 ప్రింట్స్ తో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.
ఇదొక నేషనల్ అవార్డు ఫిల్మ్ కావున దీనిని చూడటానికి పెద్దగా ప్రేక్షకులు మక్కువ చూపకపోవచ్చు అనే కారణంగా ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ చేయడమే కాకుండా, ప్రచారం కూడా చేయనున్నాడు. రియల్ లైఫ్ లో జరిగిన కథాంశంతో ఓ సామాజిక సమస్య చుట్టూ తిరిగే ఈ సినిమాకి రాజేష్ డైరెక్టర్. ఈ మూవీలో సిద్దిక్, అంజలి పాటిల్, రత్న శేఖర్ రెడ్డి, లక్ష్మీ మీనన్, నీనా కురుప్ ముఖ్య పాత్రలు పోషించారు.

