
వివాదాలతో సహజీవనం చేసే సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో దుమారం లేపారు. దేవుళ్ళకు రాష్ట్ర విభజన రంగు అంటగట్టారు.
‘నాకు దేవుళ్ళ మీద నమ్మకం లేదు. కాని, తెలంగాణ ప్రజలు యాదగిరి నరసింహు స్వామి కంటే.. ఆంధ్రా దేవుడైన తిరుపతి వెంకటేశ్వరుడిని ఎక్కువగా పూజించడం అవమానంగా భావిస్తున్నాను. మీ దేశాన్ని ప్రేమించినట్టు మీ సొంత దేవుడిని పూజించండి. ఇతర రాష్ట్రాల దేవుడికి పూజ చేయడం తగదు. తెలంగాణ ప్రజలు తిరుపతి వెంకన్న కంటే యాదగిరి గుట్ట నరసింహు స్వామిను తక్కువ సార్లు తలచుకుంటారు అని అనడంలో తప్పు లేదు కదా..? అని ట్విట్టర్‌లోప్రశ్నించారు. చాలా రోజుల తర్వాత తెలంగాణ సియం కేసీఆర్ యాదగిరిగుట్టను అభివృద్ధి చేయాలనుకోవడం శుభ పరిణామం. నాకు చాల సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రజలు తమ దేవుడి విలువ తెలుసుకుంటారు అని తన విపరీత ధోరణిలో చేసిన ట్వీట్ లకు ఫుల్ స్టాప్ పెట్టారు.
దేవుళ్ళకు రాష్ట్ర విభజన వైషమ్యాలను అంటగట్టడంపై సోషల్ మీడియాలో వర్మపై విమర్శలు వెల్లువ కురుస్తుంది. శబరిమలలో అయ్యప్పను దర్శించుకోవడానికి అన్ని రాష్ట్రాల నుండి భక్తులు వెళ్తున్నారు. అలాగే తిరుపతి అయినా, మరి పుణ్య క్షేత్రం అయినా. ఈ విషయం వర్మ గారికి తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు.

