
తండ్రి బాటను అనుసరిస్తూ మంచు వారసులు శుక్రవారం నాడు ‘స్వచ్ఛ భారత్ కాంపెయిన్’ లో పోల్గోననున్నారు. ఇటీవల స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు… తన శ్రీ విద్యానికేతన్ కళాశాల విద్యార్ధులతో కలిసి కళాశాల చుట్టు పక్కల గ్రామాలను శుభ్రపరిచారు. అనంతరం రజినీకాంత్, సుమలత అంబరీష్, పుల్లెల గోపీచంద్ తదితరులతో పాటు మంచు లక్ష్మీ, మంచు విష్ణు, మంచు మనోజ్ లను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పోల్గోనవలసిందిగా నామినేట్ చేశారు.
తండ్రి పిలుపుకు స్పందించిన మంచు మనోజ్, మంచు లక్ష్మిలు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు స్వచ్ఛ భారత్ లో పాల్గొంటున్నారు. ఆంధ్రజ్యోతి ఆఫీసు దగ్గరలో ఫిల్మ్ నగర్ బస్తిను శుభ్రపరిచే కార్యక్రమంలో మంచు లక్ష్మి పాల్గొంటారు. లింగంపల్లి రైల్వే స్టేషన్, పరిసర ప్రాంతాలలో మంచు మనోజ్ క్లీన్ ఇండియా కాంపెయిన్ నిర్వహిస్తారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు యావత్ భారతావనిలో అందరూ ఈ క్లీన్ ఇండియా కాంపెయిన్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

