
ఈ శుక్రవారం విడుదలైన ‘నా బంగారు తల్లి’ సినిమాతో విమర్శకుల ప్రసంశలు సొంతం చేసుకున్నారు దర్శకుడు రాజేష్ టచ్ రివర్. ఈ దర్శకుడి ప్రతిభ ఏంటో ‘నా బంగారు తల్లి’ సినిమాకి వచ్చిన అవార్డులు చెప్తాయి. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్వతహాగా మలయాళీ అయిన రాజేష్ మరో తెలుగు సినిమా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఎల్బీ శ్రీరాం ప్రధాన పాత్రలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. పారిశుధ్య కార్మికుల నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని రాజేష్ టచ్ రివర్ తెలిపారు. చక్కని కథ కుదిరిందని చెప్పారు. సంస్కృతం మరియు గిరిజన ప్రజల భాషల భాషల మీద మరో రెండు సినిమాలు రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

