
యువ హీరో నాని నటించిన సినిమా ‘జెండా పై కపిరాజు’ చిత్రం విడుదల మరోసారి వాయిదా పడింది. ఇటీవల ప్రకటించినట్టుగా ఈ చిత్రం నవంబర్ నెలాఖరులో విడుదల కావడం లేదని సమాచారం. డిసెంబర్ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ చిత్రం విడుదల కోసం నాని ఎదురుచూడడం మినహా అతని చేతుల్లో ఏమి లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
‘శంభో శివ శంభో’ ఫేం సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమలా పాల్, రాగిణి ద్వివేది కధానాయికలు. కెరీర్ లో తొలిసారిగా నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. శరత్ కుమార్ సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించారు. మల్టీడైమన్షన్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో వాసన్ విజువల్ వెంచర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. రజిత్ పార్ధసారధి నిర్మాత. జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.

