
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి విజయం సాధించిన తరువాత మరో సినిమా చేస్తున్న విషయం తెలిసినదే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. కోకాపేట లో ఈ సినిమాకోసం ప్రత్యేకంగా ఒక సెట్ ని వేసారు
అర్జున్ ఈ సినిమాలో వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించనున్నాడు. సమంతా, అదా శర్మ మరియు నిత్యామీనన్ హీరోయిన్స్. రాధాక్రిష్ణ నిర్మాత. రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ ప్రధానపాత్రధారులు. దేవిశ్రీప్రసాద్ సంగీతదర్శకుడు

