
ఇటీవల కొందరు పరిశ్రమ ప్రముఖులు, పెద్దలు సినిమా వేలం(ఆక్షన్) వేయడం అనే పద్దతి ప్రవేశపెట్టారు. ఇలా చేస్తే సినిమాను ఈజీగా రిలీజ్ చేసుకోవచ్చు అనే మెసేజ్ ఇవ్వడం వలన చాలా మంది సినిమాలను చిన్న సినిమాలను తీయడం ప్రారంభించారు. వాస్తవానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అటువంటి పరిస్థితులు లేవు. డిస్ట్రిబ్యూటర్స్ తో సంబంధం లేని ఒక వ్యక్తి సినిమాను ఆక్షన్ లో కొని, ఎక్కడ రిలీజ్ చేస్తారు. ఇక్కడ సమస్య డిస్ట్రిబ్యూటర్స్ తో కాదు, థియేటర్స్ తో ఉంది. థియేటర్లు లేకపోతే సినిమా ఎలా విడుదల చేయగలరు..? అని రామ్ గోపాల్ వర్మ ప్రవేశపెట్టిన సినిమా వేలం విధానంలో లోపాలను ప్రస్తావించారు ‘హృదయ కాలేయం’ దర్శకనిర్మాత సాయి రాజేష్ అలియాస్ స్టీవెన్ శంకర్.
సినిమా ఆక్షన్ అనేది ఫెయిల్యూర్ మోడల్. నేను మొదటి నుండి ఈ పద్దతిని వ్యతిరేకిస్తున్నాను. ఈ విధానాన్ని నమ్ముకోవడం వలన శ్రీకిషోర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భూ’ సినిమా మూడు నెలలు ఆలస్యంగా విడుదలవుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు రూపొందించి పబ్లిసిటీ చేసుకోగలితే సినిమా సక్సెస్ అవుతుంది’ అని సోమవారం జరిగిన ‘భూ’ ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారు. మరి వర్మ ఏమని సమాధానం ఇస్తారో..?

