మేము సైతం కార్యక్రమంలో బాహుబలి బృందం స్పెషల్ స్కిట్?

మేము సైతం కార్యక్రమంలో బాహుబలి బృందం స్పెషల్ స్కిట్?

Published on Nov 25, 2014 3:29 AM IST

mimu-sitham1
హుదుద్ భాదితులకోసం టాలీవుడ్ అంతా నడుంకట్టి ‘మేము సైతం’ అనే ఈవెంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. తారల నడుమ క్రికెట్ మ్యాచ్ లు, తంబోలాలు, అంత్యాక్షరి ప్రోగ్రామ్ లు, స్టార్ డిన్నర్ లు ఏర్పాటు చేసారు. టాలీవుడ్ ప్రముఖులే కాక తమిళనాట సూపర్ స్టార్లు సైతం ఈ వేడుకకు హాజరుకానున్నారు

అయితే ఈ ఈవెంట్ లో త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తూ పవన్, మహేష్ ల స్కిట్ హై లైట్ గా నిలవనుంది అని ఇప్పటివరకూ ఆసక్తిగా చర్చించుకున్నా ఇప్పుడు దానికి మరో స్కిట్ పోటీనివ్వనుంది. రాజమౌళి నేతృత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణి కలిపి ఒక స్కిట్ చేయనున్నట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే ఈ రెండు స్కిట్ ల కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు అనడంలో సందేహం లేదు

తాజా వార్తలు