నటి జీవితకు రెండేళ్ళ జైలు, 25లక్షల జరిమానా

నటి జీవితకు రెండేళ్ళ జైలు, 25లక్షల జరిమానా

Published on Nov 25, 2014 4:13 AM IST

Jeevitha-12
యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా తన సతీమణి జీవిత సలహాలు తీసుకుంటారని అందరికీ తెలుసు. వరుసపెట్టి కంట్రవర్సీలలో ఇరుక్కోవడం ఈ జంటకు కొత్తేమి కాదు. అయితే ఈసారి కాస్త పెద్ద ఉచ్చులోనే మునుపటి తరం నటి జీవిత పడిందని తెలుస్తుంది

ఇటీవలే గెడ్డం గ్యాంగ్ ఆడియో విడుదల జరుపుకుని సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్న జీవితకు న్యాయస్థానం తెరుకోలేని షాక్ ఇచ్చింది. ఎవడైతే నాకేంటి సినిమాకు గానూ ప్రొడ్యూసర్ కి ఇచ్చిన 22లక్షల చెక్ బౌన్స్ అయిన కారణంతో నిర్మాత ఆమెపై పెట్టిన కేస్ కు నేడు న్యాయస్థానం తీర్పునిచ్చింది. చెల్లని చెక్ ఇచ్చినందుకు రెండేళ్ళ జైలు శిక్ష మరియు పాతిక లక్షల జరిమానా విధించింది. మరి దీనికి జీవిత సమాధానం ఏమిటో చూడాలి

తాజా వార్తలు