దర్శకుడు ఏ.ఎస్ రవికుమార్ తన సొంత అకౌంట్ నుండి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లు దుమారం లేపాయి. ఈ పోస్ట్ లను తరువాత రవికుమార్ డిలీట్ చేసి తన అకౌంట్ ఎవరో హ్యాక్ చేసినట్టు తెలిపారు. రవితేజని, కులాన్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ లు అనతికాలంలోనే షేర్ లకు గురయ్యాయి
ఇప్పుడు ఈ పరిస్థితిపై రవికుమార్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వనున్నారు. ఈయన తీసిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.