
ఒకే సినిమాలో రెండు చిత్రాలు అనే సరికొత్త కాన్సెప్ట్ తో రాఘవ లారెన్స్ మన ముందుకు రానున్న విషయం 123తెలుగు ఇప్పటికే ప్రకటించింది. ఒక టిక్కెట్ కొనుక్కుని సినిమాకు వెళ్ళిన ప్రేక్షకులకు రెండు భాగాలలో రెండు వేర్వేరు సినిమాలు చూడచ్చట
ఈ వెరైటీ కాన్సెప్ట్ లో ఒక ప్రాజెక్ట్ కి ‘ది లేటెస్ట్’ అనే టైటిల్ నామకారణం చేశారు.ఇందులో లక్ష్మి రాయ్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఈ పాత్ర చాలా విభిన్నంగా వుంటుందని తలిసి లక్ష్మి రాయ్ సన్నద్ధమవుతుంది. డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంతోనైనా లక్ష్మి రాయ్ కి కావాల్సిన హిట్ వస్తుందేమో చూడాలి

