అందరినీ ఆకట్టుకుంటున్న మెగా హీరో

అందరినీ ఆకట్టుకుంటున్న మెగా హీరో

Published on Dec 2, 2014 9:14 PM IST

Varun-Tej
మెగా ఫ్యామిలీ నుంచి త్వరలో తెలుగు తెరకు పరిచయమ కానున్న మరో మెగా హీరో వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తున్న ‘ముకుంద’ సినిమా విడుదలకి సిద్దమవుతోంది. విదుఅల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా వార్తల్లో నిలుస్తోంది. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం డిసెంబర్ 3న జరగనుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కి సంబందించిన టీజర్ ని రిలీజ్ చేసారు.

ఈ సాంగ్ తీజర్ లో వరుణ్ తేజ్ లుక్, అతను చూపించిన యాటిట్యూడ్ కి అందరి నుంచీ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. వరుణ్ తేజ్ తన ఆన్ స్క్రీన్ లుక్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ ని ప్రెజెంట్ చేసిన విధానం చాలా బాగుందని అంటున్నారు. వరుణ్ తేజ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోదావరి బ్యాక్ డ్రాప్ లో తెలుగు కుటుంబ అనుబంధాల నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు