ప్రదీప్ రంగనాథన్ కి ఫస్ట్ ప్లాప్.. ముందే ఊహించాడా!

ప్రదీప్ రంగనాథన్ కి ఫస్ట్ ప్లాప్.. ముందే ఊహించాడా!

Published on Apr 11, 2026 4:57 PM IST

Love Insurance Kompany

వరుస సూపర్ హిట్స్ అందులోని వరుస 100 కోట్ల సినిమాలతో అదరగొట్టిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే ఎల్ ఐ కే(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). ఒక ఫ్యూచరిస్టిక్ లవ్ స్టొరీగా దర్శకుడు విగ్నేష్ శివన్ ప్లాన్ చేసిన ఈ సినిమా పలు వాయిదాలు తర్వాత వచ్చి ఒకింత డిజప్పాయింట్ టాక్ సొంతం చేసుకుంది.

ప్రదీప్ గత సినిమా డ్యూడ్ కి అయినా కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద 100కోట్లు రాబట్టింది కానీ ఇప్పుడు ఎల్ ఐ కె పరిస్థితి మాత్రం అందులో సగం కూడా కనిపించడం లేదు. అయితే ఇది ప్రదీప్ ముందే ఊహించినట్టే ఉన్నాడని చెప్పొచ్చు. ఆ మధ్య ప్రమోషన్స్ లో కూడా సినిమాపై అంత నమ్మకంగా 100 కోట్లు కొడతా అన్నట్టు మాట్లాడలేదు.

ప్రేక్షకులకి తన సినిమా నచ్చితే చాలు అన్నట్టే చెప్పుకొచ్చాడు. సో లైక్ ని ముందే లైట్ తీసుకున్నాడు కాబోలు.. ఈ సినిమాకి మినిమం ఓపెనింగ్స్ కూడా తెలుగులో రానట్టే టాక్. సో ఇదే తనకి ఫస్ట్ ప్లాప్ గా మిగిలిపోతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు