‘తల55’గా పేరుగాంచిన ‘ఎన్నై ఆరిందాల్’ చిత్ర టీజర్ నిన్న (బుధవారం) రాత్రి రిలీజై సోషల్ మీడియాలో బీభత్సం సృష్టిస్తోంది. అజిత్ కథానాయకుడుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ టీజర్ లో అజిత్ మునుపెన్నడూ లేనంత మాస్ లుక్ తో దర్శనమివ్వడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ‘బిల్లా’ సినిమాలో స్టైలిష్ గా కనపడి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతంచేసుకున్నాడు. రొమాంటిక్ కథలను తెరకెక్కించడంలో దిట్ట అనిపించుకున్న గౌతమ్ మీనన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
అజిత్ ఈ సినిమాలో 4 విభిన్న గెటప్స్ లో కనపడనున్నాడని, వాటికి సంబందించిన ఫోటోలు కూడా ఇప్పటికే రిలీజైనట్లు సినిమా వర్గాల సమాచారం. ఫుల్ మాస్ రోల్ లో కనపడిన అజిత్ సరసన నాయికలుగా అందాల తార అనుష్క, చెన్నై చిన్నది త్రిష నటిస్తున్నారు. కొద్ది వారల వ్యవధిలోనే విడుదలవబోతున్న ఈ సినిమాని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ.ఎమ్. రత్నం నిర్మిస్తున్నారు.


