
‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ పోరాటం ఫలించింది. తన జీవితంలో అలుముకున్న చీకట్ల నుండి బయటపడ్డారు. వ్యభిచారం ఆరోపణలపై అరెస్టై.. కొన్ని రోజులు రెస్క్యూ హోంకి పరిమితమైన ఈ హీరోయిన్ మొదటి నుండి తాను ఎటువంటి తప్పు చేయలేదని చెప్తూ వచ్చారు. ఈ రోజు నాంపల్లి కోర్టు ఆమె మాటలను నిజం చేస్తూ క్లీన్ చీట్ ఇచ్చింది. ఆమెపై నమోదైన కేసులను కొట్టివేశారు.
తీర్పు వెలువడిన తర్వాత శ్వేతా బసు ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు కోసమే చాలా రోజులుగా వేచి చూస్తున్నానని, ఈ తీర్పుతో నా కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారని తెలిపింది.
ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ కొత్త జీవితం ప్రారంభించారు. హిందీలో ఓ ప్రొడక్షన్ కంపెనీలో స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. పలువురు ప్రముఖ దర్శకులు ఆమెకు అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతానికి సున్నితంగా వచ్చిన అవకాశాలను తిరస్కరిస్తున్నారు.

