
సక్సెస్ క్వీన్ సమంత బ్రాండ్ కిరీటంలో మరో వజ్రం వచ్చి చేరింది. తెలుగు, తమిళ భాషలలో వరుస విజయాలతో మిగతా హీరోయిన్లకు అందనంత ఎత్తులో సమంత దూసుకుపోతుంది. ఇటు సినిమాలు, అటు బుల్లితెర వాణిజ్య ప్రకటనలలో సమంత జోరు చూపిస్తుంది.
ఇప్పటికే పలు బ్రాండ్ లకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్న సమంత.. తాజాగా కోకా కోల కంపెనీకి చెందిన ‘మజా’కి బ్రాండ్ అంబాసిడర్గా సంతకం చేశారు. సౌత్ హీరోయిన్లలో ‘మజా’కి బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైన తొలి హీరోయిన్ సమంత కావడం విశేషం.
ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో నటిస్తుంది. తమిళంలో ‘కత్తి’ విజయం తర్వాత చియాన్ విక్రమ్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది.

