పెళ్ళి పై పెదవి విప్పిన కామ్నా

పెళ్ళి పై పెదవి విప్పిన కామ్నా

Published on Dec 7, 2014 3:41 AM IST

Kamna-Jethmalani
రణం, కత్తి కాంతారావు వంటి సినిమాలలో నటించిన అందాల నటి కామ్నా జట్మలాని తన పెళ్లి విషయంపై పెదవివిప్పింది. ఆమెకు రహస్యంగా బెంగుళూరులో వివాహం జరిగినట్టు వార్తలు వినిపించడం వాటిని ఈ అమ్మడు ఖండించడం రివాజుగా మారిపోయింది

ఇటీవలే ఒక దుకాణం ప్రారంభోత్సవంలో ఈ ప్రశ్న ఆమెను అడగగా తనకు సూరజ్ అనే వ్యక్తి తో వివాహం జరిగినట్టు అతను బెంగుళూరులో మెకానికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్టు తెలిపింది. పెళ్ళి తనను సినిమాలనుండి వేరు చేయబోదని కూడా చెప్పుకొచ్చింది. మరి ఈ ముద్దుగుమ్మకి 123 తెలుగు ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం

తాజా వార్తలు