
ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన యంగ్ హీరో ఆది మొదటి సారిగా పూర్తి రఫ్ లుక్ తో మాస్ ఆడియన్స్ ని మెప్పించేందుకు చేసిన ‘రఫ్’ అనుకున్నట్టుగానే మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. నవంబర్ 28న రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ చిత్ర టీం పలు థియేటర్స్ ని విజిట్ చేసారు. 425కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం 200 థియేటర్స్ లో కంటిన్యూ అవుతోంది. దాంతో ఈ చిత్ర టీం త్వరలోనే ఇరు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ వీకెండ్ నుంచి ఈ సినిమాకి మరికొన్ని స్క్రీన్స్ పెరిగాయి. దానికి కారణం ఈ వారం వచ్చిన చిన్న సినిమాలేవీ ప్రేక్షకులని పెద్దగా మెప్పించలేకపోవడమే. ఈ సినిమాలో ఆది ట్రై చేసిన మాస్ లుక్, మాస్ డైలాగ్ డెలివరీకి మరియు సిక్స్ ప్యాక్ లుక్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆది సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీహరి ఓ కీలక పాత్ర పోషించాడు. సుబ్బారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ చేసిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించాడు. అభిలాష్ మాధవరం ఈ సినిమాని నిర్మించాడు. మాస్ ని మెప్పించే కొన్ని అంశాలు ఈ సినిమాలో ఉండడం వలన ఈ సినిమాకి మాస్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

