కింగ్ అక్కినేని నాగార్జున బుల్లితెరపైకి అరంగేట్రం చేస్తూ చేసిన రియాలిటీ షో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ షో హిందీలో బాగా ఫేమస్ అయిన కౌన్ బనేగా కరోడ్పతి షోకి రీమేక్ వెర్షన్. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ద్వారా నాగార్జున తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావడమే కాకుండా టిఆర్పి రేటింగ్స్ లో రికార్డ్స్ సృష్టించాడు. ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం సెకండ్ సీజన్ రేపటి నుంచి(డిసెంబర్ 8న) ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండవ సీజన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.
ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు మొదటి సీజన్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు పాల్గొని ఈ క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొని దాని ద్వారా వచ్చిన మనీని పలు చేసారు. ఇదే విధంగా సీజన్ 2 లో కూడా పలువురు తారలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 2 లో మొదటి సెలబ్రిటీగా నితిన్ మీద ఓ ఎపిసోడ్ ని షూట్ చేసారు. ఈ ఎపిసోడ్ లో నితిన్ కి జంటగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది. ఈ విషయంలో నితిన్ – రకుల్ ప్రీత్ సింగ్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


