వాయిదా పడిన అల్లు అర్జున్ స్వచ్చ భారత్

వాయిదా పడిన అల్లు అర్జున్ స్వచ్చ భారత్

Published on Dec 7, 2014 6:00 PM IST

Allu-Arjun
గాంధీ జయంతి కానుకగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘స్వచ్చ భారత్ అభియాన్’ కార్యక్రమానికి దేశ నలుమూల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మన రాష్ట్రాల్లో కూడా ఊపందుకోవడమే కాకుండా టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ స్వచ్చ భారత్ లో జోరుగా పాల్గొని పలువురికి స్పూర్తిని ఇస్తున్నారు. తాజాగా వారి జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరాడు. అనుకున్న దాని ప్రకారం అల్లు అర్జున్ ఈ రోజు స్వచ్చ భారత్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.

కానీ నిన్న సాయంత్రం అనుకోకుండా నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ చనిపోవడంతో అల్లు అర్జున్ తన స్వచ్చ భారత్ ప్రోగ్రాంని రద్దు చేసుకున్నాడు. ఈ స్వచ్చ భారత్ లో అల్లు అర్జున్ తో పాటు మెగా అభిమానులు కూడా భారీ ఎత్తున పాల్గొనాలని తెలిపారు. కానీ ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఈ ప్రోగ్రాంని వాయిదా వేసాడు, ఎప్పుడు అనేది త్వరలోనే అనౌన్స్ చేస్తాడు. ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ హరికృష్ణ ఇంటికి వెళ్లి జానకిరామ్ కి నివాళులర్పించాడు.

తాజా వార్తలు