సరికొత్త రికార్డ్ సృష్టించిన తమిళ హీరో అజిత్

సరికొత్త రికార్డ్ సృష్టించిన తమిళ హీరో అజిత్

Published on Dec 7, 2014 7:00 PM IST

Ajith1

తమిళ స్టార్ హీరో తల అజిత్ – మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ‘ఎన్నై అరిందాల్’. తమిళంలో ఫుల్ క్రేజ్ ఉన్న అజిత్ కి మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ వేచి చూస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని డిసెంబర్ 4న రిలీజ్ చేసారు. అప్పటి నుంచి ఈ టీజర్ యుట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తోంది. ఈ టీజర్ రిలీజ్ అయిన మూడు రోజుల్లో యు ట్యూబ్ లైక్స్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి టాప్ ప్లేస్ దక్కించుకుంది.

ఇప్పటివరకూ ఎన్నై అరింధాల్ కి 62,000 లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకూ ఇండియాలో హృతిక్ రోషన్ నటించిన బ్యాంగ్ బ్యాంగ్ ఫస్ట్ తీజర్ కి 61,421 యు ట్యూబ్ లైక్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ ని ‘ఎన్నై అరింధాల్’ ఫస్ట్ తీజర్ క్రాస్ చేసి రికార్డ్ సృష్టించింది. అలాగే ఇప్పటి వరకూ ఈ టీజర్ కి 2 మిలియన్ క్లిక్స్ వచ్చాయి. ఈ తీజర్ లో అజిత్ రెండు డిఫరెంట్ పాత్రల్లో కనిపిస్తాడు. అజిత్ సరసన అనుష్క, త్రిష హీరోయిన్స్ గా కనిపిస్తున్నారు. ఈ ఎన్నై అరింధాల్ సినిమా తెలుగులో ‘ఎంతవాడు గానీ’ అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.

తాజా వార్తలు