నటించడానికే పుట్టిందట..

నటించడానికే పుట్టిందట..

Published on Dec 8, 2014 12:51 PM IST

akshara-haasan
మొదటి సినిమాతోనే బిగ్ బి అమితాబ్ బచ్చన్, జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ లతో నటించే అరుదైన అవకాశం సొంతం చేసుకుంది కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్. విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు ఆర్ బల్కి అక్షర హీరోయిన్ గా పరిచయమవుతున్న ‘షమితాబ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అక్షర నటనకు ఈ దర్శకుడు మంత్ర ముగ్దులయ్యారు.

ఒకవైపు అమితాబ్, మరోవైపు ధనుష్ ఇద్దరితో పోటీపడి మరీ నటించింది. ‘షమితాబ్’ ఆమె మొదటి సినిమా అయినా తన నటన చాలా సహజంగా అనిపించింది. అక్షర హాసన్ నటన చూస్తే ఫస్ట్ టైం హీరోయిన్ అని అనుకోరు. కొన్ని సన్నివేశాలలో నటించడానికే పుట్టిందేమో అనేంతలా పెర్ఫార్మన్స్ కనబరిచింది. కమల్, సారిక ఇద్దరి లక్షణాలు ఆమెలో ఉన్నాయి. జెనెటిక్ సైన్స్ నిజమని చెప్పడానికి ఇదొక నిదర్శనం అంటూ దర్శకుడు ఆర్ బల్కి అక్షరపై ప్రశంసల వర్షం కురిపించారు.

తాజా వార్తలు