చేతులు కాల్చుకున్న రానా

చేతులు కాల్చుకున్న రానా

Published on Dec 9, 2014 2:17 AM IST

Rana
ఎడమ చేతి 5 వేళ్ళలో నాలుగు వేళ్ళకు తీవ్రమైన గాయాలయ్యాయి. మంటల్లో కాలిపోయాయి. ఎందుకు అని మాత్రం అడగవద్దు, ప్లీజ్.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు యువ హీరో దగ్గుబాటి రానా. అడగవద్దు అంటూ సున్నితంగా విన్నవించినా అభిమానులు ఊరుకుంటారా..? చెప్పండి. ఫేవరెట్ హీరోకి ఏమైందంటూ కొందరు ఆరా తీయడం మొదలుపెట్టారు. మరికొందరు అభిమానులు జాగ్రత్త అని చెప్తూ త్వరగా కోలుకోమంటూ సందేశాలు పంపిస్తున్నారు.

ప్రస్తుతం రానా తెలుగు, హిందీ సినిమాల షూటింగులతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నాడు. ‘రుద్రమదేవి’, హిందీ సినిమా ‘బేబీ’లు 2015 జనవరిలో విడుదల కానున్నాయి. వీటిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మరో క్రేజీ సినిమా ‘బాహుబలి’ కూడా 2015 ఏప్రిల్ లో విడుదల కానుంది.

తాజా వార్తలు