‘టెంపర్’కు షార్ట్ బ్రేక్..

‘టెంపర్’కు షార్ట్ బ్రేక్..

Published on Dec 9, 2014 1:34 PM IST

Temper-(2)
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘టెంపర్’ షూటింగ్ కు షార్ట్ బ్రేక్ ఇచ్చారు. ఎన్టీఆర్ సోదరుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మిక దుర్మరణం చెందడంతో నందమూరి కుటుంబ సభ్యులందరూ విషాదంలో మునిగిపోయారు. ఎన్టీఆర్ షూటింగ్ కి హాజరయ్యే పరిస్థితులు లేకపోవడంతో సోమవారం నుండి ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ ను కొన్ని రోజులు వాయిదా వేశారు.

ఫిల్మ్ ఫెడరేషన్, సినీ కార్మికుల సమ్మె వలన కొన్ని రోజులు షూటింగ్ కు అంతరాయం కలిగింది. అయినా ఎట్టి పరిస్థితులలో సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు, హీరో పట్టుదలతో ఉన్నారు. షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడంతో ఈ ఖాళి సమయంలో డబ్బింగ్ వర్క్స్ ప్రారంభించారు. కీలక పాత్రధారులు డబ్బింగ్ చెప్పనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు.

ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించారు. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ ఈ యాక్షన్ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు.

తాజా వార్తలు