రాజమౌళిని ప్రశంసించిన రజినీకాంత్

రాజమౌళిని ప్రశంసించిన రజినీకాంత్

Published on Dec 9, 2014 1:18 PM IST

rajamouli-and-rajinikanth
సౌత్ ఇండియాలోని ప్రతి ఒక్క డైరెక్టర్ అవకాశం వస్తే సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఒక్క సినిమా అయినా చెయ్యాలని అనుకుంటారు. కానీ రజినీకాంత్ లాంటి హీరో అవకాశం వస్తే పలానా డైరెక్టర్ డైరెక్షన్ లో చెయ్యాలని ఉందని చెప్పడం చాలా తక్కువగా జరుగుతుంది. ఆ అవకాశం కూడా చాలా తక్కువ మంది డైరెక్టర్స్ కి వస్తుంది. ఇప్పుడు అలాంటి ప్రశంశ తెలుగు సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళికి దక్కింది. అసలు విషయంలోకి వెళితే రజినీకాంత్ హీరోగా నటించిన సినిమా ‘లింగ’.

లింగ సినిమా కర్టన్ రైజర్ లాంచ్ నిన్న సాయంత్రం హైదరబాద్ లో జరిగింది. ఈ వేడుకలో రజినీకాంత్ మాట్లాడుతూ ‘లింగ అనేది పెద్ద సినిమా కానీ దానిని తక్కువ టైంలో తీయడం చెప్పుకోదగిన విషయం. అలా అని నేను రాజమౌళి తీస్తున్న బాహుబలి గురించి చెప్పడం లేదు. బాహుబలి రెండు పార్ట్స్ గా వస్తోంది. అలాగే ఆ సినిమాని చాలా దగ్గరగా చూస్తూ వస్తున్నాను. అలాంటి సినిమాకి టైం తీసుకోవాలి. రాజమౌళి ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్. తను ఇక్కడ ఉండడం తెలుగువారికి ఎంతో గౌరవం అని చెప్పాలి. నాకు అవకాశం వస్తే తన డైరెక్షన్ లో ఓ సినిమా చెయ్యాలని అనుకుంటున్నాని’ అన్నాడు.

కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.

తాజా వార్తలు