
ప్రతి సంవత్సరం ప్రతి సినిమా ఇండస్ట్రీ నుంచి మూవీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఈ విషయంలో ఇప్పటి వరకూ మన టాలీవుడ్ రికార్డ్ సృష్టించిందనే చెప్పాలి. గత వారంతో కలుపుకొని ఇప్పటి వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో 180 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం అందరూ ఈ సంవత్సరం టాలీవుడ్ 200 అనే మార్క్ ని టచ్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇంకా 2014 పూర్తవడానికి 3 వారాలు ఉండడంతో కొంతమంది 200 మార్క్ ని ఈజీగా టచ్ చేయవచ్చునని అంటున్నారు.
డైరెక్ట్ తెలుగు సినిమాలు కాకుండా తమిళ్, హిందీ, ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలను కూడా కలుపుకుంటే తెలుగు సినిమాల సంఖ్యా ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. 2012 వరకూ టాలీవుడ్ నుంచి కోలీవుడ్, బాలీవుడ్ కంటే తక్కువ సినిమాలు రిలీజ్ అయ్యేవి.. కానీ గత సంవత్సరం నుంచి టాలీవుడ్ లో చాలా పెద్ద మార్పు వచ్చింది. గత సంవత్సరం టాలీవుడ్ టాప్ లో నిలిచింది. ప్రస్తుతం ఉన్న సినిమాల లిస్టు ప్రకారం కూడా టాలీవుడ్ టాప్ లో ఉంది. దీనికి కారణం డిజిటల్ గా డెవలప్ అవ్వడం మరియు తెలుగు ఫిల్మ్ మేకర్స్ కూడా డిఫరెంట్ సినిమాలు చెయ్యడానికి ముందుకు రావడం. దీని ప్రకారం 2015 లో కూడా టాలీవుడ్ నుంచి మంచి మంచి సినిమాలు, కొత్తదనం ఉన్న సినిమాలు వస్తాయని ఆశించవచ్చు.

