
సూపర్ స్టార్ రజనికాంత్ నటించిన సినిమా ‘లింగ’. ఈ సినిమా మరో రెండు రోజుల్లో అనగా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ఈ సినిమా సమస్యలను ఎదుర్కుంటోంది. వచ్చిన అన్నిసమస్యలని పరిష్కరిస్తున్నా ఏదో ఒక రూపంలో కొత్త సమస్యలు వస్తూనే ఉన్నాయి. తాజాగా లింగ సినిమా కాపీ రైట్స్ తమ దగ్గర ఉన్నాయని కేసు వేసారు. బాలాజీ స్టూడియో వారు గతంలో తెలుగు సినిమా ఇంద్ర రీమేక్ రైట్స్ ని తీసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు రజినీకాంత్ లింగ మూవీ వారి దగ్గర ఉన్న సినిమాలానే ఉందని కేసు వేసారు.
ఇప్పటికే కోర్టు ఇరు పార్టీల వాదనలను విన్నది. కోర్టు తదుపరి వాయిదాని డిసెంబర్ 12కి వేసింది. ప్రస్తుతం కోర్టు వారు లింగ రిలీజ్ పై స్టే ఇవ్వడానికి నిరాకరించారు. రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో బ్యూటిఫుల్ డాల్స్ అయిన అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఓవరాల్ గా ఈ సినిమా 2300కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కావడానికి సిద్దమైంది.

