ప్రియమణి ప్లాప్ సినిమా రీమేక్ లో బిపాస బసు హాట్ షో

ప్రియమణి ప్లాప్ సినిమా రీమేక్ లో బిపాస బసు హాట్ షో

Published on Dec 10, 2014 5:35 PM IST

charulatha_alone
జాతీయ స్థాయి ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకున్న ప్రియమణి ద్విపాత్రభినయం చేసిన హారర్ సినిమా ‘చారులత’. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో రూపొందిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమాను హిందీలో ‘ఎలోన్’ పేరుతో బిపాస బసు హీరోయిన్ గా రీమేక్ చేస్తున్నారు. ‘1920 ఈవిల్ రిటర్న్స్’, ‘రాగిణి ఎంఎంఎస్ 2’ సినిమాల దర్శకుడు భూషణ్ పటేల్ దర్శకత్వం వహించారు.

ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తెలుగుతో పోలిస్తే హిందీలో శృంగారాత్మక పాళ్ళు కాస్త ఎక్కువ మోతాదులో ఉన్నాయి. హిందీలో హారర్ ప్లస్ సెక్స్ ఫార్ములా సూపర్ హిట్టయింది. దర్శకుడి గత సినిమా ‘రాగిణి ఎంఎంఎస్ 2’ ఆ కోవకు చెందిన సినిమానే. ఇక్కడ ప్లాప్ ముద్ర వేసుకున్న ఈ సినిమా బిపాసకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో..?

అసలు వివరాలలోకి వెళ్తే 2007లో థాయిలాండ్ లో విడుదలైన ‘ఎలోన్’ సినిమా ఆధారంగా ‘చారులత’ను తెరకెక్కించారు. ఒరిజినల్ సినిమా టైటిల్ ‘ఎలోన్’ను హిందీ సినిమాకు పెట్టడం విశేషం.

తాజా వార్తలు